అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్యరేఖ తూర్పుహిందూ మహాసముద్రం నైరుతి, దాని ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో గత 6 గంటల్లో 20 కి.మీ వేగంతో దాదాపు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన నిన్నటి తీవ్ర అల్పపీడనం, ఈరోజు, జనవరి 8, 2026న ఉదయము 0830 గంటలకు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా, 5.5°ఉత్తర అక్షాంశం, 84.8°తూర్పు రేఖాంశం దగ్గర, పొట్టువిల్ (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 360 కి.మీ., హంబన్‌టోట (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ., బట్టికలోవా (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ., ట్రింకోమలీ (శ్రీలంక)కి ఆగ్నేయంగా 520 కి.మీ., కరైకల్ (పుదుచ్చేరి)కి ఆగ్నేయంగా 810 కి.మీ, చెన్నై (తమిళనాడు)కి ఆగ్నేయంగా 980 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతం మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి, రేపు సాయంత్రం/రాత్రి సమయంలో, అంటే 2026 జనవరి 9న హంబన్‌టోట, కల్మునై మధ్య శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచనలు..
ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమ:- గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

శనివారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు దిశ నుండి వీచుచున్నవి. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు