ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఎంత మూర్ఖుడివిరా.. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అమాంతం దూకాడు.. ఆ తర్వాత

ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పల్నాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకుపోతోంది. ఇంతలో ఓ యువకుడు రన్నింగ్‌ బస్సులో నుంచి బయటకు దూకేశాడు. బిత్తరపోయిన ప్రయాణీకులు, బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి యువకుడ్ని పరిశీలించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడ్ని హుటాహుటిన ఒంగోలు జిజిహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. ఇంతకీ రన్నింగ్‌ బస్సు నుంచి ప్రాణాలను లెక్కచేయకుండా ఆ యువకుడు ఎందుకు దూకాడు. అంతకు ముందు ఏం జరిగింది.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

మోసాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు.. బస్సులో తన మోసం బట్టబయలు కావడంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఇంతకీ ఎం జరిగిందంటే.. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మేదరమెట్ల దగ్గర గోపీనాధ్‌ అనే యువకుడు బస్సు ఎక్కాడు. మార్గమధ్యంలో తనకు అత్యవసరంగా 200 రూపాయల ఫోన్‌పే కావాలని, ఆ డబ్బులు తాను ఇస్తానని బస్సులో పలువుర్ని ప్రాధేయపడ్డాడు. చివరకు మురళీకృష్ణ అనే ప్రయాణీకుడు అందుకు అంగీకరించి 200 రూపాయల ఫోన్‌పేను గోపీనాధ్‌ పోన్‌పే ఎకౌంట్‌కు పంపించాడు. అందుకు మురళీకృష్ణకు 200 నగదు చెల్లించాడు గోపీనాధ్‌..

అంతవరకు బాగానే ఉండగా కొద్దిసేపటికి తన ఫోన్‌ డెడ్‌ అయిందని ఒక అర్జంట్‌ కాల్‌ చేసుకుంటానని మురళీకృష్ణ దగ్గర ఫోన్‌ తీసుకున్నాడు గోపీనాధ్‌.. కాల్‌ మాట్లాడుతున్నట్టు నటిస్తూ అతని ఫోన్‌పే నుంచి మరో నెంబర్‌కు 90 వేల రూపాయల నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. తనకు 200 రూపాయల ఫోన్‌ పే చేస్తుండగా పాస్‌వర్డ్‌ను గోపీనాధ్‌ దొంగచాటుగా గమనించి గుర్తు పెట్టుకున్నాడు. ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఫోన్‌ మాట్లాడుతున్నట్టు నటిస్తూ మురళీకృష్ణ ఫోన్‌పే నుంచి తనకు తెలిసినవారి ఫోన్‌పేకు 90 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు.

ఎంతకీ తన ఫోన్‌ ఇవ్వకుండా ఇంకా కాల్‌ మాట్లాడుతున్న గోపీనాధ్‌ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన మురళీకృష్ణ తన ఫోన్‌ తీసుకుని పరిశీలించాడు.. తన పోన్‌పే నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌పేకు 90 వేలు నగదు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు గుర్తించి గోపీనాధ్‌ను నిలదీశాడు.

తాను మోసం చేసి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసుకున్నట్టు మురళీకృష్ణకు తెలియడంతో భయంతో గోపీనాధ్‌ రన్నింగ్‌లో ఉన్న బస్సు కిటికీ నుంచి బయటకు దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గోపీనాధ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు