బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

టాలీవుడ్‌ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబ‌ర్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది. అంతేకాదు, ప్రీమియర్స్ వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ. అప్పటి వరకు 50 కోట్ల దగ్గరే ఆగిన బాలయ్య సినిమాలు.. అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి.అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరసగా నాలుగు సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.

ఇక ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే శుక్రవారం థియేటర్స్ లోకి రానున్న అఖండ 2 సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అఖండ 2 ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.

ప్రీమియర్స్ కు రూ. 600 రూపాయిలు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు రూ. 50 రూపాయిలు అలాగే మల్టీప్లక్స్ లో రూ. 100 రూపాయిలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ అనుమతి కేవలం మూడు రోజులు మాత్రమే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 సినిమా టికెట్స్ రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ. 75 పెంపు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ. 100 పెంపున‌కు అనుమ‌తినిచ్చింది. అలాగే డిసెంబర్ 5న సినిమా విడుదలైన తర్వాత, మొదటి పది రోజుల పాటు ఏపీలో పెరిగిన ధరలు అమలులో ఉంటాయి.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు