అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రష్మిక.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది కన్నడ భామ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, యానిమల్, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇటీవలే హిందీలోసల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించింది ఆ సినిమా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న తన సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా రష్మిక ఏఐ వాడకం పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

“నిజాన్ని తయారు చేయగలిగినప్పుడు, జడ్జ్ చేయడం అనేది గొప్ప రక్షణగా మారుతుంది.” AI అనేది పురోగతికి ఒక పవర్ లాంటిది, కానీ అసభ్యతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేయడం, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్ ఇకపై సత్యానికి అద్దం కాదు. ఇది ఏదైనా కల్పించగల కాన్వాస్. దుర్వినియోగానికి అతీతంగా ముందుకు సాగి మరింత గౌరవప్రదమైన సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగించుకుందాం.. నిర్లక్ష్యం కంటే బాధ్యతను ఎంచుకుందాం. ప్రజలు మనుషులలా వ్యవహరించలేకపోతే, వారికి కఠినమైన, క్షమించరాని శిక్ష విధించాలి” అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు