గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లలో అకస్మాత్తుగా పెరుగుదల ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాటకీయ మార్పులకు దారితీసింది. లారీ పేజ్ ఒరాకిల్ సీఈఓ ఎల్లిసన్‌ను అధిగమించి రెండవ స్థానానికి చేరుకోగా, సెర్గీ బ్రిన్ జెఫ్ బెజోస్‌ను దాటి మూడవ స్థానంలో నిలిచారు.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లలో అకస్మాత్తుగా పెరుగుదల ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాటకీయ మార్పుకు దారితీసింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు CEO లారీ ఎల్లిసన్‌ను అధిగమించి ప్రపంచంలో రెండవ ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు.
ఆల్ఫాబెట్ షేర్ల నుండి సంపద పెరగడంతో నవంబర్ 24న లారీ పేజ్ నికర విలువ 8.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీనితో అతని మొత్తం నికర విలువ 264.9 బిలియన్లుగా అంచనా వేశారు. ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ సంపద 247.4 బిలియన్లను అధిగమించి లారీ పేజ్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా మారారు. 241.5 బిలియన్ డాలర్ల సంపద కలిగిన జెఫ్ బెజోస్‌ను అధిగమించి సెర్గీ బ్రిన్(నికర విలువ 245.5 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానానికి చేరుకున్నారు.
ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 5 ధనవంతుల లిస్ట్ చూసుకుంటే.. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 476.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే నంబర్ వన్ కుబేరుడిగా ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 264.9 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ 245.6 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో, మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు.

