శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించారు సింగర్ హేమచంద్ర. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన తోటి సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలంగా వీరిద్దరి పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ జంటలలో సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి ఇద్దరూ మంచి గాయనిగాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై పలు సింగింగ్ షోలోనూ సందడి చేశారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు. రెండు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. కొన్నాళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. దాదాపు మూడేళ్ల క్రితమే వీరు విడాకులు తీసుకున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఇద్దరూ ఈ విషయంపై స్పందించలేదు.

ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల గురించి ఎప్పుడూ ఏదోక చర్చ నడుస్తుంది. ఇటీవల మరోసారి వీరిద్దరి డివోర్స్ గురించి ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమచంద్రకు డివోర్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ పెళ్లి జీవితంపై చాలా రూమర్స్ వచ్చాయి. కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మీరు ఇప్పటివరకు స్పందించలేదు.. అలాగే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అని అడగ్గా.. గట్టిగానే రియాక్ట్ అయ్యారు హేమచంద్ర.

హేమచంద్ర మాట్లాడుతూ.. “వార్తలు ఏదైనా సరే అది నిజమా.. కాదా పక్కన పెడితే దానివల్ల మీకు ఏమైనా పనికొస్తదా.. ? అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా.. ? అంటే చెప్పు చెప్తా.. నా పై వచ్చే కామెంట్స్ ను నేను కేర్ చెయ్యను. అవి నన్ను ఎఫెక్ట్ చేయవు. నిజమా కాదా అని నేనెందుకు రెస్పాండ్ కావాలి. నేను సింగర్ గా తెలుసు. దాని గురించి అడుగు.. చాలా మంది ఏదో ఒక రకంగా వార్తల్లోఉండాలని అనుకుంటారు. కానీ నేను ఆ టైప్ కాదు.. నేను మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్పైర్ కావాలి. బేవర్స్ మాటలకు సమయం లేదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఈ విషయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని.. అప్పుడు ఆన్సర్ నచ్చితే నా జీవితం గురించి చెప్తాను. ఒకరి పర్సనల్ లైఫ్ ఎందుకు.. కావాలంటే నాకు టైమ్ ఉన్నప్పుడు మాట్లాడుతాను. అప్పటివరకు వెయిట్ చేయ్” అని అన్నారు. ప్రస్తుతం హేమచంద్ర కామెంట్స్ వైరల్ గా మారాయి.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు