పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 737 ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్ డ్రైవర్‌ (పురుష) పోస్టులను భర్తీ చేయనుంది..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన నియామక పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 737 ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్ డ్రైవర్‌ (పురుష) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పరీక్షలు డిసెంబర్‌ 16, 17 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. 552 హెడ్‌ కానిస్టేబుల్‌ (అసిస్టెంట్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌/ టెలీ ప్రింటర్‌ ఆపరేటర్‌) పోస్టులకు రాత పరీక్షలు జనవరి 15 నుంచి 22 మధ్య జరుగుతాయి. ఇక హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టులకు జనవరి 7 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరుగుతాయి. 7,565 ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబర్‌ 18 నుంచి జనవరి 6 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.

SSC ఎంటీఎస్, హవల్దార్‌ పోస్టులు పెరిగాయ్‌.. మొత్తం ఎన్నంటే?
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ ఇటీవల ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 27నాటికి మొత్తం 7,948 ఖాళీలు ఉన్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్టుల భర్తీకి పేపర్‌ 1 పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 24 వరకు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో పేపర్‌ 1 పరీక్షల షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేయనుంది. గతంలో ఇచ్చిన నోటిషికేషన్‌లో మొత్తం 4,375 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. తాజాగా మరో 5,464 పోస్టులను అదనంగా కలపడంతో.. మొత్తం పోస్టులు 7,948కు పెరిగినట్లు ప్రకటించింది. ఈ పోస్టులను సీబీటీ సెషన్ 1, సెషన్ 2, హవల్దార్‌ కోసం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు