వర్షాల కారణంగా ఈ మధ్య పాఠశాలలకు బాగా సెలవులు వచ్చాయి. అవి పక్కనపెడితే వచ్చే నెలలో సైతం స్టూడెంట్స్‌కు క్రిస్మస్ పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. ఎప్పుడు ఏంటి..? సాధారణ పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయ్.. తెలుసుకుందాం పదండి..
వచ్చే నెలలో క్రిస్మస్ రాబోతుంది. ఈ క్రమంలో సాధారణ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఎలా ఉంటాయి..? మిషనరీ పాఠశాలల్లో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ మిషనరీ స్కూల్స్‌కు ప్రతి ఏడాదిలా ఈసారి కూడా ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 28 వరకు హాలిడేస్ ఇవ్వనున్నట్లు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం. అంటే ఎనిమిది రోజుల పాటు వరుసగా బ్రేక్ లభిస్తుంది. డిసెంబర్ 29 నుంచి తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంకో మూడు రోజులకే జనవరి 1 రావడంతో, విద్యార్థులకు ఈ నెల చివరి వారమే హాలిడే మూడ్‌గా మారే అవకాశం ఉంది.
సాధారణ పాఠశాలల విషయానికి వస్తే.. ప్రభుత్వం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా అధికారిక సెలవు ప్రకటించింది. వెంటనే డిసెంబర్ 26న బాక్సింగ్ డే, ఆ తర్వాత 27 శనివారం, 28 ఆదివారం కావడంతో మొత్తం నాలుగు రోజుల వరుస సెలవులు ఉండే అవకాశముంది. శనివారం కూడా లీవ్‌గా పరిగణిస్తే ఇది చిన్న వింటర్ బ్రేక్‌లా మారుతుంది.
దసరా సెలవుల తర్వాత ఇప్పుడు క్రిస్మస్, ఆ వెంటనే సంక్రాంతి, ఆ తర్వాత వేసవి సెలవులు… ఇలా వరుసగా బ్రేక్‌లు ఉన్నప్పటికీ.. సిలబస్‌లో మిగిలిన భాగం కంప్లీట్ చేయడం స్కూళ్లకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఈ సెలవుల్లోనైనా రివిజన్, ప్రిపరేషన్ చాలా కీలకంగా మారుతోంది. సెలవులు ఎన్ని రోజులు ఉంటాయి, ఏ తేదీల్లో అమల్లోకి వస్తాయి అన్న దానిపై రాష్ట్ర విద్యాశాఖల నుండి అధికారిక నోటిఫికేషన్ త్వరలో రావాల్సి ఉంది. ముందుగానే స్పష్టత లభిస్తే ప్రయాణాలు, పండుగ ప్రణాళికలు, ఇతర ఏర్పాట్లలో ఇబ్బందులు ఉండవని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

