ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?

పాము పేరు వింటేనే కొందరు భయపడుతారు.. ఎందుకంటే ఆవి ప్రాణాంతకమైనవి.. కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం వాటిని అవకోకగా పట్టేసి వాటి భారీ నుంచి జనాలను రక్షిస్తున్నారు. ఎక్కడ పాములు ఉన్న క్షాణాల్లో వచ్చిన వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తారు. ఇలా రెండు రోజులు ఓ వ్యక్తి నాలుగు పాములను పట్టుకున్నాడు.

కొంత మంది పాము పేరు వింటేనే ఆమడ దూరం పరిగెడతారు.. అదే పాము కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేమైన ఉందా.. గుండెలు జారీపోవాల్సిందే.. కానీ అంతటి భయంకరైన పాములను అలవోకగా పట్టేసి వాటి బారి నుంచి జనాలను రక్షిస్తుంటారు స్నేక్ క్యాచర్లు. అంతేకాదు వాటికి కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. క్షణాల్లో వాలిపోయి ఆ పాములను పట్టుకుంటున్నారు. తర్వాత వాటిని జనాలకు దూరంగా సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారు, లేదా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో అప్పగిస్తారు. ఇలానే విశాఖ జిల్లాలో ఉండే ఓ స్నేక్ క్యాచర్‌ రెండు రోజుల్లో ఏకంగా నాలుగు పాములు పట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన స్నేక్ క్యాచర్ నాగరాజు రెండు రోజుల వ్యవదిలో విశాఖ ప్రాంతంలో నాలుగు పాములను పట్టుకున్నాడు. సింధియా, అగనంపూడితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ పాములను రెస్క్యు చేశాడు. పట్టుబడిన పాముల్లో ఒక్కొక్కటి దాదాపుగా 6 నుంచి 8 అడుగుల పొడవున్న నాగు, జెర్రీ పాములు ఉన్నాయి. వీటినే ర్యాట్ స్నేక్స్ అని కూడా అంటారు.

విష రహిత పాముల జాతికి చెందిన ఈ రాట్ స్నేక్స్‌ను పట్టుకొని.. వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టాడు. అయితే అడవిలో వదిలేసేందుకు నాలుగు పాములను ఒకేసారి చేతిలో పట్టుకొన్ని దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అది చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ పాములను చూస్తే ఒంట్లో వణుకు పుడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు