వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ అక్కడకి చెరువెలా వచ్చింది..!వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ అక్కడకి చెరువెలా వచ్చింది..! నగరం నడిబొడ్డున ఎందుకలా బోట్స్ తో నిరసన తెలిపారు..?
రెండేళ్లు గడిచినా వరంగల్ స్మార్ట్ సిటీ మోడల్ బస్టాండ్ నిర్మాణం మొదలుకాలేదు. పాత బస్టాండ్ ను కూల్చేశారు.. అక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు జరిపి ప్రమాదకరంగా వదిలేశారు.. సెల్లార్ నిర్మాణం కోసం సుమారు 20 ఫీట్ల లోతు మట్టి తవ్వకాలు జరిపి అసంపూర్తిగా వదిలేశారు. 74 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన బస్టాండ్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.. దీంతో పునాదుల కోసం తవ్విన బస్టాండ్ ప్రాంతం ప్రస్తుతం చెరువును తలపిస్తుంది. వర్షపు నీరంతా అక్కడే నిలిచి ప్రమాదకరంగా మారింది.
బస్టాండ్ నిర్మాణ పనులు నిలిచి పోవడంతో తాత్కాలిక బస్టాండ్ ద్వారానే ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణం అనేక విమర్శలు మూట కట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వరంగల్ కు చెందిన బీజేపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణంతో నిరసన ప్రదర్శన చేపట్టారు.
తెప్పలు, బోట్స్ తీసుకువచ్చి బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్ తో తిరుగుతూ పూలుచల్లి నిరసన తెలిపారు. రెండేళ్లు గడిచిన కనీసం ఒక పిల్లర్ నిర్మాణం కూడా చేపట్టలేదని బీజేపీ నేతలు మండి పడ్డారు. కాంట్రాక్టర్ తో కమిషన్ల విషయంలో విభేదాలు బస్టాండ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోవడానికి కారణమని ఆరోపించారు. వెంటనే బస్టాండ్ నిర్మాణపనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, వరంగల్ కో ఆ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు..

