టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీ ఇది. ఇందుసో నాగ్ మేనరిజం.. వర్మ డైరెక్షన్ జనాలను ఫిదా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా మరోసారి అడియన్స్ ముందుకు వస్తుంది.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా శివ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్న సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వర్మ మేకింగ్, యాక్షన్ సీన్స్, నాగార్జున మేనరిజం ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఈ చిత్రం ఇండియన్ మూవీ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. యూత్ ఫుల్ యాక్షన్ చిత్రాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వర్మ. ఈ సినిమా నాగార్జున కెరీర్ మలుపు తిప్పింది. అప్పట్లో తెలుగు సినిమా ప్రపంచంలో రికార్డులు క్రియేట్ చేసింది శివ సినిమా. ఇందులో నాగ్ జోడిగా అమల నటించగా.. జేడీ చక్రవర్తి, రఘువరన్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన ఇప్పటికీ 36 సంవత్సరాలు పూర్తయ్యాయి.
మరోవైపు అన్నపూర్ణ స్టూడియో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు నవంబర్ 14న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా శివ ప్రమోషన్లలో సందడి చేస్తున్నారు నాగార్జున, వర్మ. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమాతోపాటు ఇందులోని సాంగ్స్ సైతం సంచలనం సృష్టించింది. నిజానికి శివ సినిమాకు ఇప్పటికే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్, నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.
ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అన్నయ్య, సురేందర్ నిర్మించారు. అప్పట్లో రూ.1.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు 4 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమా రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 5 శాతం వాట తీసుకున్నారట వర్మ. అంటే అప్పట్లో కేవలం రూ.50 వేల నుంచి లక్ష వరకు మాత్రమే పారితోషికం తీసుకున్నారు. ఇది వర్మకు తొలి సినిమా కావడం విశేషం. అలాగే అప్పట్లో నాగార్జున ఒక్కో సినిమాకు రూ.10 లక్షలు వసూలు చేశారు. శివ సినిమాకు ఎంత తీసుకున్నారనే విషయం క్లారిటీ లేదు. ఇక అమల రూ.3 లక్షలు… జేడీ చక్రవర్తి రూ. లక్ష.. రఘువరన్ రూ.1.5 లక్ష వరకు తీసుకున్నారట.

