క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు..

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తాజాగా విడుదల చేసింది. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ అప్లికేషన్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

క్యాట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అయితే యేటా ఈ కఠిన పరీక్ష రాసే అభ్యర్ధులు ఇందులో విజయం సాధించడంలో విఫలమవుతూ ఉంటారు. పరిజ్ఞానం లేకకాదు. ఈ పరీక్ష రోజున చేయకూడని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఎందరో విఫలమవుతూ ఉంటారు. ముఖ్యంగా క్యాట్​ 2025 పరీక్ష వెళ్లేముందు అడ్మిట్ కార్డులో పేరు, ఫోటో, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇందులో చిన్నపాటి లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. అలాగే పరీక్ష రోజున టెస్ట్ సెంటర్‌కు కాస్త త్వరగా చేరుకోవాలి. అభ్యర్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్, కాలిక్యులేటర్ తీసుకువెళ్లకూడదు.

ఇక పరీక్ష ప్రారంభమైన తర్వాత స్క్రీన్‌పై కనిపించే అన్ని సూచనలను చదవడానికి కొంత సమయంల కేటాయించాలి. ముఖ్యంగా మార్కింగ్ స్కీమ్ (నెగెటివ్ మార్కింగ్), నావిగేషన్ సిస్టమ్ పూర్తిగా అర్థం చేసుకోండి. అలాగే సెక్షనల్ టైమ్ లిమిట్స్ (సాధారణంగా ప్రతి విభాగానికి 40 నిమిషాలు) కూడా మేనేజ్​ చేసుకోవాలి. కష్టమైన ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకుండా.. తదుపరి ప్రశ్నకు వళ్లాలి. ఎంచుకున్న సమాధానాలను ఒకసారి రీచెక్ చేసుకుంటే బెటర్‌.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు