తరుముకొస్తున్న మోంథా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తరుముకొస్తున్న మోంథా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను “మోంథా” గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను “మోంతా” గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, ఈరోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంపై, 14.9° ఉత్తర అక్షాంశం & 82.9° తూర్పు రేఖాంశం వద్ద, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 160 కి.మీ., కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు (అక్టోబర్ 28) సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరము దాటే సమయములో స్థిరమైన పెనుగాలులు గంటకు 90-100 కి.మీ గరిష్టంగా 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

మోంథా అలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు
మోంథా తుఫాన్ అలర్ట్.. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల చేయనున్నారు. ముందే సురక్షిత లే భై లో నిలుపుకోవాలి.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.. అని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 60-70 కి.మీ గరిస్టముగా 80 కి.మీ క్రమముగా 90 -100 కి.మీ గరిష్టముగా 110 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 90-100 కి.మీ గరిస్టముగా 110 కి.మీ క్రమముగా ఈదురు గాలులు సాయంత్రమునకు 45-55 కి.మీ గరిష్టముగా 65 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 60-70 కి.మీ గరిస్టముగా 80 కి.మీ క్రమముగా 90 -100 కి.మీ గరిష్టముగా 110 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 90-100 కి.మీ గరిస్టముగా 110 కి.మీ క్రమముగా ఈదురు గాలులు సాయంత్రమునకు 45-55 కి.మీ గరిస్టముగా 65 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 60-70 కి.మీ గరిస్టముగా 80 కి.మీ క్రమముగా 90 -100 కి.మీ గరిస్టముగా 110 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 90-100 కి.మీ గరిస్టముగా 110 కి.మీ క్రమముగా ఈదురు గాలులు సాయంత్రమునకు 45-55 కి.మీ గరిష్టముగా 65 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు