బావ పెళ్లి చేసుకొని అరడజను మంది పిల్లలతో హ్యాపీగా ఉండాలి.. ప్రభాస్ వెరైటీ విషెస్ తెలిపిన నటుడు

బావ పెళ్లి చేసుకొని అరడజను మంది పిల్లలతో హ్యాపీగా ఉండాలి.. ప్రభాస్ వెరైటీ విషెస్ తెలిపిన నటుడు

దివంగత హీరో కృష్ణ రాజు నటవారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న డార్లింగ్.. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత చత్రపతి, మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్నారు. ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదలైందో.. ఒక్కసారిగా ఆయన క్రేజ్ పాన్ ఇండియా గా మారిపోయింది. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ప్రభాస్ కు అభిమానులు పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.

ఇక రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు కొందరు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు చేస్తూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ఓ నటుడు ప్రభాస్ కు వెరైటీగా పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బావ నువ్వు పెళ్లి చేసుకుని అరడజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి! అని ఆ నటుడు విషెస్ తెలిపారు. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రభాస్ కు, మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే..

ఈ ఇద్దరూ ఒకరినొకరు భావ అని పిలుచుకుంటుంటారు. బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ కలిసి నటించారు. ఇటీవలే మంచు విష్ణు తెరకెక్కించిన కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజున మోహన్ బాబు వెరైటీగా ప్రభాస్ కు విషెస్ తెలిపారు. “మై డియర్ డార్లింగ్ బావా, నువ్వు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం, నీకు ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే మరెన్నో పుట్టినరోజులను నువ్వు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా.. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, అలాగే నీకు త్వరగా పెళ్లి జరిగి అరడజను మంది పిల్లలతో నీ జీవితంలో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే మీ బావ” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు