కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్ పదవి కోసం కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్ పదవి కోసం కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. DCC అధ్యక్ష ఎన్నికల కోసం AICC పరిశీలకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట ఇన్చార్జ్గా ప్రకటించాలని కోరుతూ రెండు రోజుల క్రితం గాంధీభవన్లో ఆయన అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.ఇటీవల రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయితే ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి వర్గానికి పోటీగా పటేల్ రమేష్ రెడ్డి అనుచరుల గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిముషం వరకు సూర్యాపేట టికెట్ కోసం ప్రయత్నించినా పటేల్ రమేష్ రెడ్డికి దక్కలేదు. ఆయన స్థానంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ దక్కినా ఆయన గెలవలేకపోయారు. రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన.. పటేల్ రమేష్ రెడ్డికి ఇన్చార్జ్ ఇవ్వాలని అనుచరులు గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఇన్చార్జ్గా ఎవరిని నియమిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.