ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్ష సూచన ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.