ఓటీటీలో ప్రతివారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల్లో మిరాయ్ సినిమా అస్సలు మిస్ అవ్వకండి
వారం వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే మరో వైపు ఇటీవల విడుదలైన సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో కాంతార చాప్టర్ 1 సినిమా సందడి చేస్తుంది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రేక్షకులంతా ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్స్ లో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలోకి కూడా అదిరిపోయే సినిమాలు రానున్నాయి. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న శశివదనే అనే సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ సందేశ్ నటిస్తున్న కానిస్టేబుల్ సినిమాకూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకురానుంది. అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే..
నెట్‌ఫ్లిక్స్..
- స్విమ్ టు మీ: అక్టోబరు 10
- ది విమెన్ ఇన్ క్యాబిన్ 10: అక్టోబరు 10
- కురుక్షేత్ర : అక్టోబరు 10
- వార్ 2: అక్టోబరు 9 ( క్లారిటీ లేదు)
అమెజాన్ ప్రైమ్ వీడియా
- మెయింటెనెన్స్ రిక్వైర్డ్: అక్టోబరు 8
జియో హాట్‌స్టార్
- మిరాయ్: అక్టోబరు 10
- సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్): అక్టోబరు 10
సన్‌నెక్స్ట్
- త్రిబాణధారి బార్బరిక్: అక్టోబరు 10
జీ 5
- స్థల్: అక్టోబరు 10