కరివేపాకులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పోషకాలతోపాటు విటమిన్-సి, విటమిన్-బి, విటమిన్-ఇలు అధికం. రోజూ తీసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. ఖాళీకడుపుతో కరివేపాకు తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. కరివేపాకులో విటమిన్-ఎ అధికం. ఇది కంటి చూపును మెరుగుపరచడమేకాదు, కంటి సమస్యల్ని ముందుగానే నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా మారతుంది. ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. కరివేపాకు తింటే LDL అనే చెడు కొలెస్ట్రరాల్ తగ్గుతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపి కూడా కంట్రోల్ అవుతుంది. హార్ట్ హెల్త్ బాగుంటుంది.
కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అయితే, ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది. కరివేపాకు తింటే ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుందిది. నాడీసంబంధిత వ్యాధుల్నీ, క్యాన్సర్లనీ అడ్డుకుంటుంది. కరివేపాకు వాసన పీల్చితే ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయట. ఇంకా జ్ఞాపకశక్తిని పెంచే కరివేపాకు అల్జీమర్స్ లాంటి వ్యాధుల్నీ దరిచేరనివ్వదట.
కరివేపాకులో చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా-అందంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. వీటిల్లోని విటమిన్-సి, విటమిన్-బి, ప్రొటీన్లు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తూ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. జుట్టు నిగారింపునూ పెంచుతాయి. అంతేకాదు, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే లక్షణాలు ఎక్కువే కాబట్టి చుండ్రు సమస్యలకూ కరివేపాకును ఎక్కువగా వాడుతున్నారు.