తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న నైరుతి విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మరాత్వాడ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కి మీ ఎత్తువరకు ఉంది. అలాగే.. ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్ – మధ్య ప్రాంతం నుండి తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది.. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.