పవన్ కళ్యాణ్ కోసం 19ఏళ్ల తర్వాత రంగంలోకి.. ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఆ స్టార్

పవన్ కళ్యాణ్ కోసం 19ఏళ్ల తర్వాత రంగంలోకి.. ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఆ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేప్పట్టిన తర్వాత చాలా బిజీ అయ్యేరు. ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లోనూ వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు పవన్. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ఓజీ సినిమా ఒకటి ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆతర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు పవన్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవలే పవన్ కళ్యాణ్ లుక్‌ను రిలీజ్ చేశారు. పవన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. అలాగే హీరోయిన్స్ గా రాశి ఖన్నా, శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ సినిమా కోసం 19ఏళ్ల తర్వాత ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎవరో కాదు ఒకానొకప్పుడు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రమణ గోగుల. కళ్యాణ్, రమణ గోగుల కాంబినేషన్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. బద్రి, తమ్ముడు, జానీ, అన్నవరం సినిమాలకు మ్యూజిక్ అందించారు రమణ గోగుల. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రమణ గోగుల ఓ సాంగ్ పాడనున్నారని తెలుస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రమణ గోగుల పాట పడనున్నారని అంటున్నారు. ఇటీవలే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టుమీద రామచిలకవే సాంగ్ పాడారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం పాట పడనున్నారు రమణ గోగుల.. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు