కృష్ణమ్మ పరుగులు.. జల సవ్వడి చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి..

కృష్ణమ్మ పరుగులు.. జల సవ్వడి చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి..

కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ జలాశయాలకు వరద పొటెత్తుతుంది. కృష్ణమ్మ పరుగులతో.. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద కొన‌సాగుతోంది.. దీంతో రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తారు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ జలసవ్వడిని చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు.

దీంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 45వేల వరద వస్తుండగా లక్షా 66వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.. ప్రస్తుత నీటిమట్టం 589 అడుగులు.. కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 310 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 312 టీఎంసీలు ఉంది.. జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..

ఇదిలాఉంటే.. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 3 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ఫ్లో లక్షా 44వేల వరద వస్తుండగా లక్షా 49వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 211 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు