కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే అస్సలు కొనరు!

కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే అస్సలు కొనరు!

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు..

దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 6 శనివారం ఆల్ టైమ్ గరిష్ఠ రికార్డును చేరుకున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. లక్ష స్థాయికి చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 1.08 లక్షల దాటేసింది

మీరు ఆభరణాలు తయారు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, తాజా ధరలను ఒకసారి తప్పకుండా తనిఖీ చేయండి. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అటువంటి పరిస్థితిలో సరైన సమాచారం లేకుండా కొనుగోలు చేయడం వల్ల మీరు నష్టపోవచ్చు.

ఉదయం నుంచి ఇప్పటి వరకు కొన్ని గంటల వ్యవధిలోనే తులం బంగారం ధరపై భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 870 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,08,490 రూపాయల వద్ద కొనసాగుతోంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 800 రూపాయలు పెరిగి ప్రస్తుతం 99,450 రూపాయల వద్ద ఉంది. అంటే ఇది కూడా లక్ష రూపాయలకు దగ్గరలోనే ఉంది.

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. కిలోపై ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర 1 లక్షా 28 వేల రూపాయల వద్ద ఊగిసలాడుతోంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలోకు 1 లక్షా 38 వేల వద్ద ఉంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు