మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఎస్బీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కంప్యూటర్‌ ఆధారితంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న మెయిన్స్‌ పరీక్షను సెప్టెంబర్‌ 13న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. కాగా దేశ వ్యాప్తంగా మొత్తం 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల నియమకాలను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్, మెయిన్, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.

సెప్టెంబర్‌ 14న ఎన్‌డీఏ, ఎన్‌ఏ & సీడీఎస్‌-2025 పరీక్షలు.. వెబ్‌సైట్లో అడ్మిట్‌ కార్డులు విడుదల
NDA, CDS Admit Card 2025: నేషనల్ డిఫెన్స్‌ అకాడమీ (NDA), నావల్‌ అకాడమీ (NA), కంబైన్డ్‌ డిఫెన్స్ సర్వీస్‌ (CDS) ఎగ్జామినేషన్‌-2 పరీక్షలకు సంబంధించి రాత పరీక్షలు మరో వారంలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) హాల్‌టికెట్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్షలు సెప్టెంబర్ 14న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు