ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?

పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిదే. అయినప్పటికీ దీనిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందట. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాలు, పెరుగు తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిదే. అయినప్పటికీ దీనిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందట. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాలు, పెరుగు తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే గ్లాసు వేడివేడి పాలతో రోజును ప్రారంభిస్తారు. ఇది మాత్రమే కాదు కొంత మంది ఖాళీ కడుపుతో పెరుగు కూడా తింటారు.

ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. పాల ఉత్పత్తులలో సహజ లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది.

కొన్నిసార్లు పెరుగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఖాళీ కడుపుతో మాత్రం దీనిని తీసుకోకూడదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు