ఇదేదో అల్లాటప్పా ఆకురాయి కాదండోయ్..! ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం.. ఖరీదు తెలిస్తే..

ఇదేదో అల్లాటప్పా ఆకురాయి కాదండోయ్..! ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం.. ఖరీదు తెలిస్తే..

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రం ఎక్కడుందో మీకు తెలుసా..? అవును దాంతో ఈ దేశం దశ ఒక్క క్షణంలో మారిపోయింది. తవ్వకాల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రం వారికి లభించింది. వజ్రాల గని నుండి ఇంత పెద్ద వజ్రం లభించిన తర్వాత ఈ దేశం చాలా ధనవంతురాలైంది. ఈ వజ్రం 2,492 క్యారెట్లదని చెబుతారు. ఈ ఆవిష్కరణ తర్వాత కంపెనీ అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఇది ఎక్కడుంది.. దాని విలువ ఎంత ఉంటుంది.. ఇలాంటి పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రం కనుగొనబడింది. ఈ అరుదైన, భారీ వజ్రం ఆఫ్రికాలో అత్యంత వజ్రాలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒకటైన బోట్స్వానాలోని కరోవే వజ్ర గనిలో కనుగొనబడింది. దీనిని కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కనుగొంది. ఇది రత్నం-నాణ్యత గల వజ్రం. ఇది కుల్లినన్ డైమండ్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రం.

అది ఎన్ని క్యారెట్లు?

ఈ వజ్రం బరువు 2,492 క్యారెట్లు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రంగా నిలిచింది. దీనిని ఆగస్టు 2024లో కెనడియన్ మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్ప్ కనుగొంది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం కుల్లినన్ వజ్రం. దీని బరువు 3,106 క్యారెట్లు, 1905 లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వజ్రం నిర్మాణం, పారదర్శకత, పరిమాణం దీనిని చాలా అరుదుగా, విలువైనదిగా చేస్తాయి. భవిష్యత్తులో దీనిని మిలియన్ల డాలర్లకు అమ్మనున్నారు.. బోట్స్వానా ఆర్థిక వ్యవస్థకు వజ్రాల ఎగుమతులు 80 శాతానికి పైగా దోహదం చేస్తాయి. ఈ వజ్రాల అమ్మకం ద్వారా మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో పెట్టుబడి పెట్టగల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

ఇప్పుడు వజ్రాన్ని ప్రాసెసింగ్ కోసం పంపించారు. అక్కడ దానిని చాలా చిన్నవిగా కానీ, చాలా విలువైన వజ్రాలుగా కత్తిరిస్తారు. బోట్స్వానా గనులు ఇంతకు ముందు కూడా చాలా పెద్ద వజ్రాలను ఉత్పత్తి చేశాయి. కానీ ఈ 2,492 క్యారెట్ల వజ్రం ఇప్పటివరకు అత్యంత ప్రత్యేకమైన వాటిలో ఒకటి.

Please follow and like us:
బిజినెస్