ఉత్తరం ఉరిమింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అతి భారీ వర్షాలతో అడవుల జిల్లా ఆగమైంది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ వివరాలు ఎలా ఉంటాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.! ఓ సారి లుక్కేయండి ఇక్కడ.
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి ఈరోజు ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 9.6 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది. ఈ స్పష్టమైన అల్పపీడనం రాగల 12 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారి అటు పెమ్మట పశ్చిమ వాయువ్యదిశలో కదిలి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈనెల 19వ తారీకు మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. నిన్న విదర్భ దాని పరిసరాలలో కొనసాగిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 5:30 గంటలకు బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి ఈరోజు ఉదయం 08:30 గంటలకు రుతుపవన ద్రోణిలో విలీనమైంది.
ఋతుపవన ద్రోణి ఈరోజు నాలియా, జల్గావ్, బ్రహ్మపురి, జగదల్పూర్, అటు నుండి పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న స్పష్టమైన అల్పపీడన ప్రాంత కేంద్రం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. తూర్పు పశ్చిమ ద్రోణి ఈరోజు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ గుజరాత్, విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం, ఉత్తర మరాత్వాడ, మీదుగా, మీదుగా పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కేంద్రం వరకు సగటు సముద్రం అట్టనుండి 1.5 నుండి 3.1 కి మీ మధ్యలో కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిశకు వాలి ఉంది.
♦ రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
- ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది
♦ వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, భారీ నుండి అతి భారీ అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది
- రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు , అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు, ఎల్లుండి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.