టీటీడీ ప్రకటనతో ఆగస్టు 16న శనివారం తిరుమలలో కొందరు భక్తులు పరుగులు తీశారని.. ఏదైనా తొక్కిసలాట జరిగితే.. ఎవరు బాధ్యులంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
సోషల్ మీడియా యుగం.. ఏది పడితే అది.. ఫేక్ కంటెంట్ ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో షేర్ చేయడం చాలా మందికి అలవాటుగా మారుతోంది. ఇవి అపోహలను సృష్టించి గందరగోళానికి దారితీస్తున్నాయి.. కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు సోషల్ మీడియా ద్వారా మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియా ద్వారా చాలా మంది యూజర్లు ఫేక్ వీడియోలు, వార్తలను పోస్ట్ చేసి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా.. టీటీడీ ప్రకటనతో ఆగస్టు 16న శనివారం తిరుమలలో కొందరు భక్తులు పరుగులు తీశారని.. ఏదైనా తొక్కిసలాట జరిగితే.. ఎవరు బాధ్యులంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు చేశారు. దీనిపై పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇదంతా ఫేక్ ప్రచారమని.. భక్తులను భయబ్రాంతులకు గురిచేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పేర్కొంది.. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నవారిని ప్రభుత్వం ఉపేక్షించదు.. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది.. అంటూ హెచ్చరించింది.. అంతేకాకుండా ఆరోజుకు సంబంధించి అసలైన వీడియోను కూడా షేర్ చేసింది.
‘‘ఆగస్టు 16వ తేదీ శనివారం ఉదయం తిరుమలలో భక్తులు పరుగులు తీసారని… టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని… తొక్కిసలాట జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేవలం ఫేక్ వీడియో. వరుస సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫలితంగా ఎక్కడా భక్తులు గందరగోళానికి గురి కావడం కానీ, పరుగులు పెట్టడం కానీ జరగలేదు. ఆగస్టు 16 వ తేదీ నాటి వాస్తవ వీడియో చూసిన వారెవరికైనా అక్కడ భక్తులెవరూ ప్రమాదకరంగా పరుగులు పెట్టలేదని… క్యూ లైన్లలో సాఫీగా వెళ్ళి దర్శనం చేసుకున్నారని అర్ధం అవుతుంది. తిరుమల విషయంలో కొందరు కావాలనే ఇటువంటి ఫేక్ ప్రచారాలకు దిగుతూ, భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ… వారి మనోభావాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు. స్వామి పై నమ్మకం లేని కొందరు చేస్తున్న కుట్ర ఇది. అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదు. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది.’’ అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా పేర్కొనడంతోపాటు.. అసలైన వీడియోను షేర్ చేసింది.