వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!

కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు..

కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు ధనుంజయ్‌పై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడన బాలుడిని ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీ, పెద్ద బజార్ లలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా గ్రామాల్లో వీధి కుక్కలు అధికంగా ఉన్నాయి. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పిల్లలు, మూగజీవాలపై దాడికి తెగబడుతున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో రోజురోజుకూ కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. రాజాం ప్రాంతీయాసుపత్రికి రోజూ 15 నుంచి 20 కేసులు వస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కరణం హరిబాబు తెలిపారు. నాలుగు మండలాల్లో ప్రభుత్వ దవాఖానాకు ప్రతి నెలా పది నుంచి 30 మంది వరకు కుక్కకాటు బాధితులు వస్తున్నారని అన్నారు.

ముఖ్యంగా చికెన్, మటన్‌ దుకాణాల వద్ద వీటి బెడద అధికంగా ఉంటుంది. క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు