3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది. నూనె, చక్కెర, బియ్యం వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. వీటి అధిక వినియోగం మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ మూడు పదార్థాలను మూడు నెలల పాటు మానేస్తే ఆరోగ్యానికి లాభమా..? నష్టమా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి ఈ మూడు పదార్థాలను మూడు నెలలు మానేస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే శారీరక సామర్థ్యం, శ్వాస సామర్థ్యం కూడా పెరుగుతాయి.

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది: బియ్యం, చక్కెర, నూనెలో మోనోజెనిక్, ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచి, బరువు పెరగడానికి కారణమవుతాయి. ఈ పదార్థాలను తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

మధుమేహం నియంత్రణ: చక్కెరను మానేయడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అదేవధంగ నూనె వినియోగం తగ్గడం వల్ల క్యాలరీలు తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఫ్యాటీ లివర్: బియ్యంలోని కార్బోహైడ్రేట్లు, నూనెలో ఉండే కొవ్వు కాలేయానికి హాని చేస్తాయి. ఈ రెండింటిని మానేయడం వల్ల కొవ్వు కాలేయ సమస్యలు తగ్గుతాయి.

ఈ మూడు పదార్థాలను మానేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు బరువు తక్కువగా ఉన్నా.. లేదా చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నా, లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. లేకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు