అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన మరో ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో స్పష్టమైంది. శుక్రవారం ఈ మూవీ నుంచి ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
హీరోయిన్‌కు తన మనసులోని ప్రేమను హీరో వ్యక్తం చేసే క్రమంలో ‘గిబిలి గిబిలి’ పాట వస్తుంది. సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే పదాలతో ఈ పాటను రాయటం అందరినీ ఆకట్టుకుంటోంది. మల్లెగోడ గంగ ప్రసాద్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా, చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనీల్ గీల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.