నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

కాగా.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది.. ఇన్‌ఫ్లో 2,01,743, ఔట్‌ఫ్లో 41,985 క్యూసెక్కులు ఉంది.. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో క్రస్ట్ గేట్లు తెరుచునున్నాయి..

క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు భారీగా క్యూ కడుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు