యూజీసీ నెట్ జూన్ సెషన్-2025 పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాధానాల కీ జూలై 5న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల జూలై 6 నుంచి జూలై 8 వరకు స్వీకరించింది. తాజా ప్రకటన మేరకు..
యూజీసీ నెట్ జూన్ సెషన్-2025 పరీక్షల ఫలితాల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాధానాల కీ జూలై 5న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల జూలై 6 నుంచి జూలై 8 వరకు స్వీకరించింది. తాజా ప్రకటన మేరకు యూజీసీ నెట్ ఫలితాలు జులై 22న విడుదల చేయనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత పొందాలంటే.. జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీని ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జూనియర్ రిసెర్చ్ ఫెలో(JRF)తోపాటు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యార్థుల ఆరోగ్యం కోసం స్కూళ్లలో ‘ఆయిల్ బోర్డులు’ ఏర్పాటు చేయండి.. పాఠశాలలకు సీబీఎస్‌ఈ లేఖ
విద్యార్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పాఠశాలల్లో మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో సీబీఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త ప్రకటన జారీ చేసింది. సీబీఎస్సీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ‘ఆయిల్ బోర్డులు’ సైతం ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్ డా.ప్రజ్ఞా ఎం.సింగ్ అన్ని స్కూళ్లకు లేఖ రాశారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరచడానికి వివరించేలా బోర్డులు అమర్చాలని ఆ లేఖల్లో కోరింది.
ఇదే అంశంపై ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేటి జీవనశైలి కారణంగా పిల్లలు, పెద్దల్లో ఊబకాయం సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విషయాన్ని లేఖలో సీబీఎస్‌ఈ వివరించింది. ఊబకాయం అనేక వ్యాథులకు కారణమవుతుందని, అందువల్లనే ఆహారం, చిరుతిళ్లపై విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని లేఖలో పేర్కొంది. ఆహారంలో భాగంగా పండ్ల వినియోగం పెంచాలని తెలిపింది.