వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.1,14,000లు ఉండగా, 2026 నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరుగుదలతో సరఫరా తగ్గుతుండటం దీనికి కారణం. వెండి ఆభరణాలపై డిమాండ్ ఎక్కువగా ఉంది.
భారతీయులు బంగారం తర్వాత అంతగా ఇష్టపడేది, కొనుగోలు చేసేది ఏదైనా ఉందంటే అంది వెండి. నిజానికి బంగారం కంటే ఎక్కువ మోతాదులోనే వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఆభరణాలు, వస్తువుల కోసం వెండికి విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే ఈ లోహాన్ని పలు పరిశ్రమల్లో, పలు రకాల వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. అలా వెండి వాడకం బాగా పెరిగి.. మెల్లమెల్లగా దాని డిమాండ్‌కు సప్లయ్‌కి మధ్య తేడా వచ్చేస్తోంది.
డిమాండ్ తగ్గ సప్లయ్ ఉండటం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా వెండి ధర పెరుగుతోంది. అది కూడా చాలా వేగంగా పెరుగుతోంది. మొన్నీమధ్యే రూ.లక్ష దాటిన కిలో వెండి ధర ఇప్పుడు రూ.1,14,000లకు చేరింది. ఇలాగే చూస్తుంటే.. 2026 నాటికి కిలో వెండి రూ.2 లక్షలు కావడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం వెండి ధర ఒక లక్షా 14 వేలకు చేరడంతో.. ఇదే వేగంతో స్వల్పంలోనే ఒక లక్షా 40 వేలకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అంత కంటే ఎక్కువ కూడా పెరగొచ్చు.
అలాగే 2026 నాటికి సులభంగా కిలో వెండి రూ.2 లక్షలు అందుకుంటుందని అంచనా. పైగా 2026 ఏడాదికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఐదు నెలల్లో వెండి ధర డబుల్ అవ్వడం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదే జరిగితే.. వెండి కూడా బంగారం అంత ప్రియం అయినట్లే. వెండే బంగారమాయేనే.. పరిస్థితి మారొచ్చు. వెండి కొనాలి అనుకునే వాళ్లు ఇప్పుడు కొనడం మంచిది. అలాగే వెండిలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవాళ్లకు కూడా ఇదే మంచి సమయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.