తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా అగ్నిప్రమాదం జరిగి సుమారు 44 మంది మరణించగా.. అక్కడే నిన్న మరో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదాల నుంచి ప్రజలు తేరుకోకముందే తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్‌లోనూ సోమవారం మధ్యాహనం మరో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపటి రైల్వే ష్టేషన్‌లో ఆగి ఉన్న ట్రైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాయలసీమ నుంచి షిరిడి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఆగి ఉండగా ట్రైన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అవి కాస్త పక్క బోగీలకు వ్యాపించడంతో మంటల్లో రెండు భోగీలు కాలిపోయినట్టు తెలుస్తోంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానిక రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారంతో హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. అయితే ప్రమాద స్థలంలో మంటలు ఇంకా అదుపులోకి వచ్చాయా లేదా అనే దానికిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు