సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాద ఘటనపై తాజాగా అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికులు మృతదేహాలు ఇంకా లభించకపోవడంతో.. కార్మికుల కుటుంబాలను పరిశ్రమ వద్ద నుంచి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. మూడు నెలల తర్వాత తిరిగి రావాలని సూచించారు.

పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్‌ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో కొందరి మృతదేహాలు లభ్యం కాగా మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కోసం ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు గాలింపు చేపట్టిన అధికారులు తాజాగా ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. గల్లంతైన వారు కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమేనని తేల్చి చెప్పారు. గల్లంతైన కార్మికులు రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ మృతదేహాలు పేలుడు దాటికి కాలి బూడిదయిపోయి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక వాళ్ల ఆచూకీ లభించడం కష్టమని ప్రకటించారు.

ఈ క్రమంలో బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లిపోయవాలని తెలిపారు. మూడునెలల తర్వాత తిరిగి రావాలని.. అప్పటివరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో అధికారులు సంప్రదింపులు ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

ఇదిలా ఉండగా ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు తమను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంలో మరణించి.. మృతదేహాలు లభించిన వారి కుటుంబాలకు కంపెనీ పరిహారం ప్రకటించింది. కానీ ఆచూకీ లంభించని కార్మికుల విషయంలో మాత్రం కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో బాధితు కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు