అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు హిట్టు కోసం ఎదురుచూపులు..

అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు హిట్టు కోసం ఎదురుచూపులు..

తెలుగు సినీరంగంలో అక్కినేని నాగార్జున క్రేజ్ గురించి తెలిసిందే. నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగిన నాగ్.. ఇప్పుడు పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు. దశాబ్దాలపాటు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. హీరోయిజం సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆయన తర్వాత నాగేశ్వరరావు లెగసీని ఏమాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు అక్కినేని నాగార్జున. సహజమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా తిరుగలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. శివ సినిమాతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన నాగ్.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్నారు.

ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్.. ఇప్పుడు కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఊపిరి సినిమాతో సరికొత్త ప్రయోగం చేసిన నాగ్.. ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో సీబీఐ ఆఫీసర్ పాత్రలో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య సైతం హీరోగా సక్సెస్ అయ్యారు. ఇటీవలే తండేల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది.

మరోవైపు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సైతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ఈ ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. గతంలో నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అఖిల్ జోడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటించింది. ఇక నాగార్జునతో కలిసి పూజా హెగ్డే సినిమా చేయలేదు. కానీ వీరిద్దరి కాంబోలో గతంలో ఓ యాడ్ వచ్చింది. అలా అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన రికార్డ్ క్రియేట్ చేసుకుంది పూజా.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు