అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రమంతటా ఉంటాయని వివరించింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి .
గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు జూలై 07న ఉదయం 0830 గంటలకు నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉన్నది . ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది.
ద్రోణి ఇప్పుడు దక్షిణ రాజస్థాన్ నుండి నైరుతి పరివాహక పశ్చిమ బెంగాల్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3 .1 నుండి 7.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణ దిశగా వంగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
సోమవారం, మంగళవారం, బుధవారం : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
సోమవారం, : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది .
మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
——————-
సోమవారం, మంగళవారం, బుధవారం : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.