బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

గంటకు 40 -50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, దేశవ్యాప్తంగా రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది.

తెలంగాణ వర్ష సూచన ఇలా..
బికనీర్, జైపూర్, దాటియా, సిద్ధి, అసన్సోల్, కలకత్తా, ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ జార్ఖండ్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. ఈరోజు(శనివారం), రేపు(ఆదివారం), ఎల్లుండి(సోమవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు