థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది.. అలాగే కల్కి సినిమా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ గా రానున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు అందాల భామలు నటించనున్నారు.

రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే రాజా సాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. కాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ అందాల భామ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.

ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టార్ హీరో సతీమణి కరీనా కపూర్. ఇప్పటికే ఈ అందాల భామను చిత్రయూనిట్ సంప్రదించిందని తెలుస్తుంది. ప్రభాస్ కు బాలీవుడ్ లోనూ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లో సినిమాకు మరింత మైలేజ్ రావాలంటే రాజా సాబ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కరీనాతో చేయించాలని మారుతి నిర్ణయించాడని తెలుస్తుంది. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు. త్వరలనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు