పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై అనుచితంగా కామెంట్స్ చేసిన వారిని గుర్తించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో పలువురు వ్యక్తులు డిప్యూటీ సీఎంపై అనుచితంగా కామెంట్స్ చేసినట్లు గుర్తించి చర్యలు ప్రారంభించారు. వారిలో కొందరిని అరెస్టు చేశారు.

ఏ2 గా ఉన్న ఉప్పలగుప్తం మండలం యస్ యానాంకు చెందిన కర్రీ వెంకట సాయి వర్మ, ఏ3 గా యలమంచిలి మండలం వందలపాకకు చెందిన పాముల రామాంజనేయులు, ఏ4 గా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన షేక్ మహబూబ్ భాషా లను పోలీసులు అరెస్టు చేశారు. A1 తో పాటు పలువురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేయడం నేరమని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు