పొడి దగ్గుతో విగిసిపోయారా? ఖాళీ కడుపుతో ఇది చిటికెడు తిన్నారంటే..

పొడి దగ్గుతో విగిసిపోయారా? ఖాళీ కడుపుతో ఇది చిటికెడు తిన్నారంటే..

పొడి దగ్గు చాలా మందికి అనుభవమే. ఇది ఓపట్టాన వదలదు. రాత్రి పడుకున్న తర్వాత దగ్గు నిద్రపోనివ్వదు. దీనికి దగ్గు మందు కూడా పని చేయదు. విరుద్ధంగా, దగ్గు మరింత పెరుగుతుంది. రాత్రంగా నిద్ర పోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అని ఆలోచించేవారికి ఇంట్లోనే దొరికే..

తీవ్రమైన వేడిలో చాలా మందికి చల్లని పానీయాలు తాగే అలవాటు ఉంటుంది. ఎండ నుంచి నేరుగా ఏసీ గదిలోకి వెళ్లేవారు కూడా ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల పొడి దగ్గు వస్తుంది. రాత్రి పడుకున్న తర్వాత ఈ విధమైన పొడి దగ్గు మూడు రెట్లు పెరుగుతుంది. దీనికి దగ్గు మందు కూడా పని చేయదు. విరుద్ధంగా, దగ్గు మరింత పెరుగుతుంది. రాత్రంగా నిద్ర పోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అని ఆలోచించేవారికి ఇంట్లోనే దొరికే కొన్ని సహజ పదార్ధాలతో చిటికెలో ఉపశమనం కలిగించే చిట్కాలు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు.. పిల్లలకు దగ్గు వస్తే తేనె వినియోగించేవారు. నిజానికి ఇది పెద్దలకు కూడా పని చేస్తుంది. తేనే దగ్గుకు ఉపశమనం కలిగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి పొడి దగ్గుతో బాధపడేవారు తేనెను ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా తీసుకోవాలి. ఇది రోజంతా చిరాకు కలిగించే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా తొలగిస్తుంది. ఒట్టిగా తేనె మాత్రమే తినకూడదనుకుంటే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని కూడా తాగవచ్చు. ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మరింత ప్రయోజనం పొందవచ్చు. తక్కువ మంట మీద తేనె వేడి చేసి, కొద్దిగా చల్లబడిన తర్వాత అందులో లవంగాల పొడి కలిపి తీసుకోవాలి. దీనివల్ల కూడా సమస్య వెంటనే తొలగిపోతుంది.

కానీ తేనె మాత్రమే కాదు, వెల్లుల్లి కూడా ఇలాంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో వేడి చేసి బాగా కలపాలి. తర్వాత దానిని వేడి అన్నంతో తినవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బ తినగలిగితే, జలుబు, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం పొందొచ్చు. వెల్లుల్లి బలమైన ఘాటు వాసన కారణంగా తినడానికి ఇబ్బంది పడుతుంటే, దానిని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. జలుబు, దగ్గును తగ్గించడానికి అల్లం సహాయపడుతుందని దాదాపు అందరికీ తెలుసు. కానీ చాలా మందికి తక్షణ ప్రయోజనాల కోసం దానిని ఎలా తీసుకోవాలో తెలియదు. టీలో అల్లం కలిపి తాగడం ప్రయోజనకరమని చాలా మంది అనుకుంటారు. కానీ టీకి బదులుగా కాఫీలో అల్లం కలిపి తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీ బాగానే పనిచేస్తుంది.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు