ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించింది. దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో..ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక, డీఏ, ఆరోగ్య భద్రత పెండింగ్ బిల్లుల కార్యాచరణపై చర్చించినట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించించి. ప్రస్తుతం ఒక డీఏ, ఆరునెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్ బకాయిలను నెలకు 700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తామని..పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేస్తామని ప్రకటించారు భట్టివిక్రమార్క. రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీకాలం పొడిగింపు ఉండదని..ఉద్యోగుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు భట్టి విక్రమార్క.