అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే

అమృత్ భారత్ స్కీమ్.. తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే

ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు.

కేంద్రం తీసుకొచ్చిన అమృత్‌ భారత్‌ స్కీమ్‌…తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లకు మహర్దశ తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది మోదీ సర్కార్‌. ఇందులో భాగంగా మొదటి విడతలో 103 రైల్వే స్టేషన్లు ఇవాళ్టి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను నేడు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధి పనులను 2023 ఆగస్టులో ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలంగాణలో 2,750 కోట్ల రూపాయలతో 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ తెలంగాణకు 5 వేల 337 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఇవాళ హైదరాబాద్‌లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లు ప్రారంభిస్తారు ప్రధాని. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. రైల్వేస్టేషన్ కార్యకలాపాలన్ని మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు