ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

ఎంతటి అమానుషం.. అప్పు చేసింది తల్లి.. శిక్ష అనుభవించింది 9 ఏళ్ల కొడుకు..!

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చవటపాలెంనకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ తొమ్మిదేళ్ల కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది.

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్తా మరో మలుపు తిరిగింది. వెట్టిచాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది. బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చవటపాలెంనకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ తొమ్మిదేళ్ల కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది. తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా పసివాడిని పనిలో పెట్టుకున్న యజమాని దాష్టికం చూపించాడు. ఏకంగా ఆ పసివాడి ఉసురు కూడా తీసుకుంది. 9 ఏళ్ల కొడుకు వెంకటేశులు ఆచూకీపై ఆందోళనతో తల్లి పోలీసులు ఆశ్రయించడంతో విచారణలో వెలుగు చూసింది ఈ దారుణం.

సత్యవేడు కు చెందిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద పని చేస్తూ అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేక పోయింది. దీంతో 9 ఏళ్ల కొడుకును బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద 9 నెలల క్రితం పనిలో పెట్టింది. బాతులు మేపే పనిలో ఉన్న కొడుకు తిరిగి తీసుకెళ్లేందుకు అప్పుగా తీసుకున్న రూ 40 వేలు సమకూర్చుకునే ప్రయత్నం చేసిన తల్లి అంకమ్మ గత నెలలో అప్పు తీర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తుకు పోన్ చేసి అప్పు కడతానని చెప్పింది. కొడుకును అప్పగించాలని కోరింది.

అయితే కొంత సమయం కావాలన్న ముత్తు దాట వేసే ప్రయత్నం చేశాడు. నెలరోజులు గడుస్తున్నా కొడుకు ఆచూకీపై సరైన సమాచారం రాక పోవడంతో ఆరా తీసిన తల్లి అంకమ్మ వ్యాపారిని నిలదీసింది. మే 15వ తేదీన సత్యవేడులోని ముత్తు కుటుంబ సభ్యులను అడిగింది. ముత్తు కుటుంబ సభ్యుల తీరుపై అనుమానం వచ్చి ఈ నెల 19 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి అదృశ్యంపై ఆరా తీసిన పోలీసులు ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తు, అతని భార్య, కొడుకును విచారించారు. బాతులు మేపే క్రమంలో 40 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడు మృతి చెందినట్లు తెలిపిన ముత్తు అక్కడే పాతి పెట్టినట్లు చెప్పాడు.

ముత్తు చెప్పిన వివరాలు ప్రకారం కంచిలోని బాలుడికి వైద్యం చేసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. అక్కడి సీసీ టీవీ పుటేజీ పరిశీలించి డాక్టర్లను విచారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ముత్తు తోపాటు భార్య, పెద్ద కొడుకును అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 9 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయించి బాండెడ్ లేబర్ గా మార్చిన ముత్తు ఫ్యామిలీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు అభియోగాలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు సత్యవేడు పోలీసులు. మరోవైపు బాలుడి మృతదేహాన్ని వెతికి తీసి చంగల్ పట్టు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు