నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

తన నటనతో , డాన్స్ తో ప్రపంచాన్నే ఊపేశాడు నందమూరి చిన్నోడు, అభిమానుల మ్యాన్ ఆహ్ మాసెస్ ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే.. నటనలో తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు దిద్ది.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు అభిమానులు, సినీ సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. తారక్‌ బర్త్‌ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది. ఒకటీ, రెండూ… కాదు ఏకంగా పదుల సంఖ్యలో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయంటేనే ఎన్టీఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ ప్రపంచామంతట అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.

19ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ గా మారాడు. స్టూడెంట్ నెం.1 బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఆర్ఆర్ఆర్‌తో మరింత పీక్స్‌కి చేరింది. ఇక దేవర సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు తారక్. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా పరిచయమైన ఎన్టీఆర్.. ఆతర్వాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రశాంత్ నీల్ మూవీనుంచి బర్త్ డే విషెస్ తో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే వార్ 2 నుంచి కూడా ఓ క్రేజీ అప్డేట్ రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు ఫ్యాన్. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు విషెస్ చెప్తున్నారు ఫ్యాన్స్.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు