డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 షో తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేని రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. మే 9న తొలి ఎపిసోడ్ కంప్లీట్ కాగా.. తాజాగా డ్యాన్స్ ఐకాన్ 2 ఫినాలే ముగిసింది. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు.. ? ప్రైజ్ మనీ ఎంత అనే విషయాలపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే పోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ 2 స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేను రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేస్తుంది ఆహా. ఫస్ట్ ఎపిసోడ్ మే 9న ముగిసింది. ఇక సెకండ్ ఎపిసోడ్ మే 16న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ షోలో గెలిచిన విజేతకు ట్రోఫీ ప్రజెంట్ చేయడానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా ఎనిమిదేళ్ల చిన్నారి బినీతా ఛెత్రి నిలిచింది. సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా చిన్నారి బినీతా చెత్రికి ట్రోఫీ అందించారు.

అలాగే ఆ చిన్నారికి ఆహా ఓటీటీ రూ.5 లక్షలను బహుమతిగా అందించారు. ఇక ఈ షోలో వచ్చినవాడు గౌతమ్ మూవీ టీమ్ సైతం సందడి చేసింది. ఈ మూవీలో హీరోగా నటిస్తున్న అశ్విన్ బాబు డ్యాన్స్ ఐకాన్ 2 విజేతకు మరో 5 లక్షలు బహుమతిగా అందించారు.

అలాగే ఈ షోలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సైతం సందడి చేశారు. డ్యాన్స్ ఐకాన్ షోకు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జడ్జీలుగా ఉన్నారు.

డ్యాన్స్ ఐకాన్ 2లో విజేతగా నిలిచిన బినీతా ఛెత్రి కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ మెంటార్షిప్ లో పాల్గొంది. ప్రతి వారం అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో జడ్జీలను, ప్రేక్షకులను ఆకట్టుకున్న బినీతా ఛెత్రి.. చివరకు విజేతగా నిలిచింది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు