నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

కాల్షియం కార్బైడ్‌ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు దురాశను కలిగించింది.

ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.హైదరాబాద్ పాతబస్తీ, మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్, శాలి వాహన నగర్ లలో గోదాములపై దాడి చేశారు . సలీమ్ నగర్ గోదాంలో సుమారు రూ.60 వేలు.శాలివాహన నగర్ లో రూ.3.50 లక్షల విలువ గల పండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లను గోదాంలుగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టేందుకు ఎథిలైన్‌, కాల్షియం కార్బైడ్‌, కాల్షియం ఎసిటిలైడ్‌ వంటి కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు.. తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. కాల్షియం కార్బైడ్‌ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు దురాశను కలిగించింది.

ఈ దాడుల్లో మొత్తం రూ.4.10 లక్షల విలువ చేసే మామిడి పండ్ల ను .ఇద్దరి వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు..ఈ కేసు ను తదుపరి విచారణ నిమిత్తం మలక్ పేట పోలీసులకు అప్పగించారు…

Please follow and like us:
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు