చాలా రోజుల తర్వాత ఓ అద్భుతం.. మిస్సైళ్లలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

చాలా రోజుల తర్వాత ఓ అద్భుతం.. మిస్సైళ్లలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

చాలారోజుల తర్వాత ఓ అద్భుతం.. కొన్నాళ్లపాటు పడడం తప్ప.. పైపైకి దూసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. అలాంటిది ఇవాళ స్టాక్ మార్కెట్‌ ఊహించని స్థాయిలో ఆకాశంలోకి దూసుకెళ్లింది.. స్టాక్‌ మార్కెట్ సూచీలు మిస్సైళ్లలా దూసుకెళ్లాయి. 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలను చేరువ అవ్వడం మళ్లీ ఇదే ఫస్ట్‌టైమ్‌. దీంతో ఇన్వెస్టర్లు ఆనందంలో మునిగిపోయారు..

చాలారోజుల తర్వాత ఓ అద్భుతం.. కొన్నాళ్లపాటు పడడం తప్ప.. పైపైకి దూసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. అలాంటిది ఇవాళ స్టాక్ మార్కెట్‌ ఊహించని స్థాయిలో ఆకాశంలోకి దూసుకెళ్లింది.. స్టాక్‌ మార్కెట్ సూచీలు మిస్సైళ్లలా దూసుకెళ్లాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 2వేల 9వందల 75 పాయింట్లు పెరిగి 82వేల 429 పాయింట్ల దగ్గర ఆగింది. ఇటు నిఫ్టీ చూస్తే కనివినీ ఎరగని రేంజ్‌లో 9వందల 16 పాయింట్లు పెరిగి 24వేల 924 పాయింట్ల దగ్గర ఆగింది. మదుపర్ల సంపద ఇవాళ ఒక్కరోజే 16లక్షల కోట్లు పెరిగింది.

2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలను చేరువ అవ్వడం మళ్లీ ఇదే ఫస్ట్‌టైమ్‌. దీంతో ఇన్వెస్టర్లు ఆనందంలో మునిగిపోయారు.. మదుపర్లు లక్షల కోట్లు పొగొట్టుకున్నారని ఈ మధ్యకాలంలో తరచువిన్నాం. కానీ ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 16లక్షల కోట్లు పెరిగి.. BSEలో మొత్తం సంపద 4వందల 32లక్షల కోట్లకు చేరింది.

అసలు ఈ బుల్‌ రన్‌ ఎందుకు కొనసాగింది అనేది విశ్లేషిస్తే.. నాలుగు అంశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా-చైనా టారిఫ్‌వార్‌కి బ్రేక్ పడడం

ఇండియా-పాక్ బోర్డర్‌ టెన్షన్స్ తగ్గడం.. కాల్పుల విరమణ ఒప్పందం..

ఫారిన్ ఇన్వెస్టర్లు మళ్లీ ఎంట్రీ ఇవ్వడం

షార్ట్ కవరింగ్‌ స్టార్ట్ అవ్వడం

అసలు ఇవాళ మార్కెట్ ఎందుకు దూసుకెళ్లింది?.. ఈ ఎగబాకడం కేవలం ఊరింపా.. కొనసాగుతుందా? ఇంతకీ ఇదే జోష్ కంటిన్యూ అవుతందా. లేదంటే ఇవాళ ఒక్కరోజే మార్కెట్లు ఊరించాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే.. మరికొన్ని రోజులు ఆశజనకంగానే ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు