బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోస్ ఏ రేంజ్‏లో పారితోషికం తీసుకుంటారో చెప్పక్కర్లేదు. కానీ అతిథి పాత్తలు చేసేందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ చాలా మంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గెస్ట్ రోల్స్ చేసినందుకు అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందామా.

సినీరంగంలో ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్.. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నవారే. ఎన్నో సవాళ్లు దాటి తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ మీకు తెలుసా.. ? సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించినందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్స్ ఎవరో.. అతడు మరెవర్ కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్. తన కూతురు నిర్మించిన లాల్ సలామ్ సినిమాలో రజినీ ముఖ్య పాత్రలో నటించాడు. నివేదికల ప్రకారం ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు ఆయన రూ.40 కోట్లు పారితోషికం తీసుకున్నారట.

ఆ తర్వాతి స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నారు. ధనుష్ నటించిన ఆత్రంగి రే సినిమాలో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ పోషించారు. ఇందుకు ఆయనకు దాదాపు 27 కోట్లు పారితోషికం ఇచ్చారట. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించినందుకు బీటౌన్ స్టార్ అజయ్ దేవగన్ రూ.25 కోట్లు తీసుకున్నారు. అదే సమయంలో గంగూబాయి కతియావాడి చిత్రానికి రూ.11 కోట్లు అందుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అలియా భట్ రూ.9 కోట్లు తీసుకుంది.

అయితే ఇప్పటి వరకు భారతీయ సినీరంగంలో అతిథి పాత్రకు అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రజినీకాంత్ పేరు వినబడింది. కానీ తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం రజినీ నటిస్తోన్న జైలర్ 2 సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఈ రూమర్స్ పై క్లారిటీ తెలియరాలేదు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు