గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే గోల్డ్ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః
బంగారం కొనాలనుకునే పసిడి ప్రయులకు అలర్ట్.. మీరు బంగారం కొనాలనుకుంటే కొనేయొచ్చు.. ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,574లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,776లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇళా ఉన్నాయి..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,910, 24 క్యారెట్ల ధర రూ.95,890 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల రేటు రూ.95,740 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా 4ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760,, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది.
వెండి ధరలు..
గత కొన్ని రోజులుగా బంగారంతో పాటుగా వెండికి కూడా ఇప్పుడు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్ నగల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగించడంతో దానికి డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులుగా పెరుగూ వస్తున్న వెండి ఇవాళ కొంచెం తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పొల్చుకుంటే ఇవాళ వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాలతో పాటు ప్రధాన భారతీయ నగరాల్లో తాజా వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి వెండి ధర గ్రాము రూ.107.90లు కాగా, కిలో వెండి ధర రూ. 1,08,900లుగా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,900
ముంబైలో రూ.96,900
బెంగళూరులో రూ.96,900
చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.